గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి : ఈటల రాజేందర్

-

నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి ఈటల రాజేందర్ కోరారు. వరంగల్ లోని ప్రదీప్‌రావు ఇంటి వద్ద ఎంఎల్సీ ఓటర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 2019లో 90 సీట్లు గెలిచింది బీఆర్‌ఎస్ పార్టీ. ఈ పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరూ పోటీ చేయలేదు. కరీంనగర్‌లో నాలుగున్నర లక్షల మెజారిటీతో గెలిచింది. కానీ కేవలం నాలుగు నెలల్లో ఆ మెజారిటీ అంతా కరిగిపోయింది. ఇప్పుడు బీజేపీ మాత్రమే ముందంజలో ఉంది.

ఔర్ఏక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు. అందుకే ఈ సారి రమేష్ ఖచ్చితంగా గెలుస్తారని నేను నమ్ముతున్నాను. చదువు రాని వారు కూడా జై మోడీ అంటున్నారు. ఇది మోడీ అభివృద్ధి చూసి వచ్చిన చైతన్యం. ఇప్పుడు పట్టభద్రులైన యువకులు అందరూ కూడా బీజేపీనే కోరుకుంటున్నారు. మరొక పార్టీ ప్రభావాలు కాస్త ఉండొచ్చేమో కానీ ఇప్పుడు మెజారిటీ మాత్రం బీజేపీదే. పట్టభద్రులకు కూడా వెల కట్టే సంస్కృతి వస్తే అది సమాజానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్నే కూల్చి వేస్తుంది. జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని తత్వవేత్తలు చెప్పినట్లు మీరు పనిని బట్టి ఓట్లు వేయాలి.

నిరుద్యోగ యువకులకు కేసీఆర్ 3 వేల భృతి ఇస్తానని మభ్యపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రమాణాలు చేసింది. కానీ నెరవేర్చక పోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడగడు. అడిగితే శాసనమండలిలో ప్రేమేందర్ రెడ్డి అడగాలి. 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగులకు డీఏఏలు ఇవ్వట్లేదని, ఆరోగ్య కార్డులు ఇవ్వట్లేదని ప్రేమేందర్ రెడ్డి ఖచ్చింతంగా అడుగుతారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రమాణాలను నెరవేర్చవలసిందిగా కాంగ్రెస్ మంత్రులను గల్లా పట్టి అడగాల్సిన వారు బీజేపీ ఎమ్మెల్సీలే. ఈ పదవి అలంకారం కోసం కాదు, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేవాళ్లం కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను.

50 ఏళ్ల పైబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ కాలం నుండి గరీబీ హఠావో నినాదం ఇప్పటికీ రాహుల్ గాంధీ చేస్తున్నారు. మోడీ గారి పరిపాలనలో 11 వస్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 5 వస్థానానికి చేరింది. ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకునిగా పేరు పొందారు ప్రధాని మోడీ. జమ్ము కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసి శాంతి నెలకొల్పారు. త్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళల జీవితాలలో వెలుగు నింపారు. అయోధ్య రామాలయం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన హిందువుల నిరీక్షణకు తెరదించారు. చైతన్యానికి మారుపేరైన నా వరంగల్ గడ్డ మీద ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరందరూ మేధావులు, పట్టభద్రులు. బాగా ఆలోచించి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news