వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు : గంగుల

-

ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ, ధాన్యం కొనుగోళ్లకు సహకరించకున్నా ఆ సంస్థతో సంబంధం లేకుండా యాసంగిలో పండించిన ప్రతి గింజను కొంటామన్నారు. కనీసం మద్దతు ధర క్వింటాలకు రూ.2,060 చొప్పున సేకరిస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్న వారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు వెల్లడించారు. 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని వివరించారు. అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news