70 లక్షల మందికి కంటి పరీక్షలు : హరీష్

-

తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్న వారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు వెల్లడించారు.

4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని వివరించారు. అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు.

ఇక అటు బీఆర్ఎస్ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు సోమవారం ప్రకటించారు. పార్టీ శ్రేణులను ఏకం చేసేలా ఆత్మీయ సమ్మేళనాలు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు,నాలుగు నెలల పాటు విస్తృతంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news