ఔవ్వ! ఈ బామ్మ ఏం చేసిందో తెలుసా..?

-

‘అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట’. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నరా? ఎందుకంటే ఇటీవల ఇంగ్లండ్‌లో ఓ బామ్మ చేసిన పని ఈ పాటను గుర్తుకుతెచ్చింది. కిరణా సరుకులకు వెళ్లిన బామ్మ ఆ సరుకులతోపాటు తెచ్చిన వస్తువును చూసి.. కుంటుంబసభ్యులు ముందుగా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కడుపుబ్బ నవ్వుకున్నారు.

ఇంగ్లండ్‌లోని ల్యాంక్‌షైర్‌కు చెందిన జోష్‌ మేరీ అనే 76 ఏండ్ల బామ్మ ఇటీవల కిరాణాషాప్‌కు వెళ్లి సరుకులు తెచ్చింది. ఆ సరుకులను పరిశీలించిన బామ్మ భర్త జాన్‌ రిలే.. అందులో ఉన్న డ్యూరెక్స్‌ కండోమ్స్‌ జంబో ప్యాక్‌ను చూసి షాకయ్యాడు. ‘ఇదేం పోయేకాలమే.. నీకు ఈ వయసులో కండోమ్స్‌తో ఏం పని’ అని ప్రశ్నించాడు. అయితే బామ్మ కూడా ‘చాల్లే ఆపు.. కండోమ్స్‌తో నాకేం పని’ అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చింది. దీంతో తాత జాన్‌ రిలే బామ్మ తెచ్చిన కండోమ్స్‌ జంబో ప్యాక్‌ను తీసిచూపించడంతో నోరెళ్లబెట్టింది.

కాసేపటికి షాక్‌ నుంచి తేరుకున్న బామ్మ.. టెట్లీ టీ పౌడర్‌ ప్యాకెట్‌ అనుకుని కండోమ్స్‌ ప్యాకెట్‌ తెచ్చినట్లు అసలు విషయం చెప్పింది. రెండు ఎరుపురంగులోనే ఉండటంతో పొరపడ్డానని చెప్పి సిగ్గుతో నవ్వుకుంది. విషయం తెలిసి బామ్మ భర్త జాన్‌, మనవరాలు రిలే కూడా పగలబడి నవ్వారు. ఆ తర్వాత బామ్మ.. కండోమ్స్‌ ప్యాకెట్‌ షాప్‌లో తిరిగిచ్చి రమ్మని మనవరాలు జమ్మాను కోరింది. ఈ విషయం అంతటినీ జమ్మా ఫొటోలతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version