‘గ్రాండ్‌పా కిచెన్‌` వంటల తాత.. ఇక లేరు

-

‘గ్రాండ్‌పా కిచెన్‌’.. యూట్యూబ్‌ ఫాలో అవుతున్న వాళ్లందరికీ పరిచయం. ఆసక్తి ఉన్న చానెల్‌. ఈ చానెల్‌ నడుపుతున్న కుక్, గ్రాండ్‌ పా పేరు నారాయణ రెడ్డి(73). ఆయన వంటల వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తనదైన శైలిలో సంప్రదాయ, ఆధునిక వంటకాలను పెద్ద మొత్తంలో అత్యంత సులభంగా వండటమే కాకుండా.. ఆ వంటకాలను అనాథ పిల్లలకు వడ్డిస్తూ ప్రపంచానికి మంచిని పంచిన ఆ వంటల తాత ఇకలేరు.

అక్టోబరు 27న ఆయన చనిపోయినట్టు ఆయన యూట్యూబ్‌ చానల్‌లోనే బుధవారం ప్రకటించారు. 2017లో ప్రారంభించిన ఆయన చానల్‌కు దాదాపు 61 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అక్టోబరు 24న చివరిసారి ఆయన ఆ చానల్‌లో కనిపించి తన ఆరోగ్యం గురించి వివరాలు తెలిపారు. ఆ తర్వాత మూడురోజులకే కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news