ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్.!

-

బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నీహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశంలో అన్ని రకాలుగా సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది.. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు.

రీసెంట్ గా ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నవాద్ లాపిడ్ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి  నెగిటివ్ కామెంట్స్ చేయడం తో దేశంలో మళ్లీ వివాదం చెలరేగిన సంగతి అందరికి తెలిసిందే. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’  మంచి వసూళ్లు రాబట్టింది. గతంలో నూ ఈ సినిమా పై చాలా వివాదాలు కూడా వచ్చాయి. ఇది రాజకీయ నాయకులు మధ్య వార్ నడిచేలా చేసింది.

తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ ‍అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలా సంతోషం గా ఉంది అని తన ఆనందం ట్విటర్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ అవార్డు ను తాను  ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news