లాస్ ఏంజిల్స్ లో చిరంజీవికి ఘన సన్మానం

-

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ కేంద్రం ప్రకటించింది.దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించినది.

 

అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని లాస్ ఏంజెలిస్లోని తెలుగు వారు ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి.. శాలువాలతో చిరంజీవి కి తెలుగు అభిమానులు, మెగా అభిమానులు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…. ‘పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. నాకంటే ఎక్కువగా మీరు సంతోష పడుతున్నారు. ఇంతకుమించిన అవార్డు ఏముంటుంది? నాపై మీరు చూపిస్తోన్న అభిమానం వెలకట్టలేనిది’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news