అనుకోకుండా రూ.16 లక్షలు చెత్తకుప్పలో పారేశాడు..ఆ తర్వాత సినిమా టిక్ లెవల్ లో ఛేస్ చేశారు..మొత్తానికి

-

ఎంత డబ్బున్న వాళ్లకైనా..డబ్బు ఎప్పటికీ చేదుకాదు..ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే అనిపిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి అక్షరాలు 16 లక్షలను చెత్తుకుప్పలే వేశాడు. కానీ ఇతను డబ్బు ఎక్కువై అలా ఏం చేయలేదు. పాపం తెలియక వేశాడంట..ఆ తర్వాత సినిమాటిక్ లెవల్ లో ఛేజింగ్ లు ఫోన్ కాల్స్ అబ్బో పెద్ద హడావిడే జరిగింది..ఈ వార్తకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

గ్రీస్ దీవి లెమన్స్‌లో ఉండే ఓ వ్యాపారవేత్త తన వ్యాపారం కోసం తనతో రూ.16 లక్షలు ఆఫీసుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చెయ్యాలని అనుకొని ఓ కవరులో డబ్బును పెట్టాడు. ఆ కవరును మరో పెద్ద సంచిలో ఉంచాడు. అయితే అదే పెద్ద సంచిలో మరో కవర్ ఉంది. అందులోనే చెత్త ఉంది. దాన్ని దారిలో పారేయాలన్నది ఆయన ఆలోచన. అసలు ఈ ఆలోచనే తప్పుకదా..డబ్బును, చెత్తను అలా కలిపి ఎందుకు పెట్టాడు. ఇక్కడే వచ్చింది సమస్య. రోడ్డుపై వెళ్తుంటే దారిలో పెద్ద చెత్త డబ్బా కనిపించింది. అంతే… తన పెద్ద సంచిలోని చిన్న కవర్ బయటకు తీసి ఈజీగా విసిరేశాడు. తర్వాత తాపీగా ఆఫీసుకు వెళ్లాడు.

ఉద్యోగిని పిలిచి పెద్ద సంచిలోని మరో కవర్ తీసి అతనికి ఇచ్చి “ఇది మొత్తం రూ.16 లక్షలు. త్వరగా బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేసేయ్” అన్నాడు. ఆ ఉద్యోగి కవర్‌ తెరచి చూస్తే అందులో చెత్త ఉంది. సార్ ఇదేంటి సార్ చెత్త ఉంది అని ఆ ఉద్యోగి చెప్పడంతో మనోడికి దిమ్మతిరిగిపోయింది. మ్యాటర్ అర్థమైంది. చెత్త అనుకొని డబ్బు ఉన్న కవర్‌ను చెత్త డబ్బాలోకి విసిరేశానని చెప్పాడు. ఉద్యోగి షాక్ అయ్యాడు

వెంటనే పోలీసులకు కాల్ చేసిన వ్యాపారవేత్త ‌విషయం చెప్పాడు. కాసేపటికే ఏ చెత్త డబ్బాలో డబ్బు విసిరేశారో ఆ ప్లేస్‌కి వ్యాపారవేత్త, పోలీసులు వెళ్లారు.. కానీ అక్కడ మున్సిపాలిటీవాళ్లు మరీ సిన్సియర్ గా వర్క్ చేసినట్లు ఉన్నారు..అప్పుటికే అక్కడ ఖాళీ చెత్త డబ్బా ఉంది. అంటే అప్పటికే నిండిన డబ్బాను మున్సిపాల్టీ వారి ట్రక్ పట్టుకుపోయింది. ఇక మున్సిపాలిటీ ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అటు పోలీసులు, ఇటు వ్యాపారవేత్త తమ తమ వాహనాల్లో వెళ్తుంటే దారిలో ఆ చెత్త ట్రక్ కనిపించింది. దానిపై 2 డస్ట్ బిన్స్ ఉన్నాయి. దాని డ్రైవర్‌తో పోలీసులు చెక్ చేయించగా ఆ సంచి అలాగే ఉంది. అందులో డబ్బు చెక్కు చెదరలేదు.

డబ్బు కనిపించటంతో ఆ వ్యాపారవేత్తకు ప్రాణం లేచివచ్చినట్లైంది. డబ్బు తీసుకున్నాడు. పొరపాటున చేసిన పనికి మొత్తం అందరిని హడావిడీ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news