RRR : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో దీపావళి కానుక..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది… ఒక ఆర్.ఆర్. ఆర్ మూవీ మాత్రమే అని చెబుతారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు.

భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అనౌన్స్ మెంట్ డే నుంచే .. భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ న‌టించ‌డం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, దోస్తీ పాటకు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా దీపావళి కానుకగా… అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రం. ఈ సినిమా లోని రెండో పాటను విడుదల తేదీని ఖరారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ విడుదల తేదీ ని రేపు సాయంత్రం ప్రకటిస్తామని అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.