గెజిట్‌ అమలుపై తెలంగాణకు ఊరట !

-

కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న గెజిట్‌ వివాదంపై ఇవాళ గోదావరి రివర్‌ బోర్డు సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట కలిగింది. ప్రయోగాత్మకంగా పెద్ద వాగు గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయాలని జీఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సిబ్బంది ఎవరి రాష్ట్రాల పరిధిలో వారు ఉంటారని… జీఆర్‌ఎంబీ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం లో ని అన్ని ప్రాజెక్టు లను బోర్డ్ పరిధిలోకి తేవాలని అటు ఆంధ్ర ప్ర దేశ్‌ రాష్ట్ర అధికారులు కోరారు. అయితే.. దీనిపై స్పందించి జీఆర్‌ఎంబీ.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో పెద్దవాగు పర్యవేక్షణ వరకే బోర్డ్ పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వం అంగీకరిస్తేనే… పూర్తి స్థాయిలో పెద్దవాగును అప్పగిస్తామని చెప్పారు తెలంగాణ అధికారులు. కేవలం పర్యవేక్షణ మాత్రమే బోర్డ్ చూస్తోందని తెలిపారు తెలంగాణ అధికారులు. అలాగే… బోర్డ్ కు సీడ్ మనీ విషయం స్పష్టత కోరారు తెలంగాణ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news