Bathukamma songs 2021: మ‌ట్టి మ‌నుషుల ముఖచిత్రం “బతుకమ్మ” 2021లో విడుదలైన పాటలు

Bathukamma songs 2021: ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే ఏకైక‌ పండుగ బ‌తుక‌మ్మ‌. ఆడ‌పిల్లలు ప్రకృతిని దైవంగా పూజించే అరుదైన సంప్రదాయం. ఆట పాట‌ల‌తో కొలిచే ప్ర‌కృతి వేడుక‌. ఇది ఒక పూల పండుగ మాత్రమే కాదు. అపూర్వ సమ్మేళనాల వేదిక. అవిభక్త బంధాల ఆత్మీయ కలయిక. ఆడబిడ్డ అనురాగం, ఆత్మీయ పలకరింపులు.

ఈ పండుగ స‌మ‌యంలో పాడే పాట‌కు కూడా చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. ఆ పాట‌ల్లో ప‌ల్లె జీవుల జీవ‌న ప్రయానం. మ‌ట్టి మ‌న‌సుల బ‌తుకులు, తొల‌క‌రిలో పుడమి పులకింత, నేల తల్లి ప‌రిమాళాలు, ఏరు పారినప్పుడు గంగను చేసినే చ‌ప్ప‌ట్లు. ఆడబిడ్డ అనురాగం, ఆత్మీయ పలకరింపులు ఇలా అన్ని భావాల‌ను, బాధ‌ల‌ను స్మరించుకుంటూ సాగేదే బతుక‌మ్మ పాట‌.

ఈ సారి తెలంగాణ ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ పండుగ‌ను చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. తెలంగాణ జానపదం.. బతుకమ్మ పాటకు ప్రపంచవ్యాప్తంగా చేయ‌డం కోసం.. కృషి చేస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా.. బతుకమ్మ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ల‌తో ఓ పాట‌ను రూప‌క‌ల్ప‌న చేయించింది.
అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా’.. అంటూ సాగే ఈ బతుకమ్మ పాట విశేషంగా ఆకట్టుకుంటుంది.


అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా
పూలఇంద్ర ధనస్సులే నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మలై వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా..

తరలివచ్చే తంగెడు… తనకు పట్టు చీరగా
రవికెలాగా తామర… పువ్వులన్ని మారగా

తనువుకేమో గుమ్మడి… బంధమయ్యి నిలువునా
పొద్దుపొడుపు దిద్దినే నుదుటి మీద కుంకుమ

కూలి తల్లి గొంతులో కోయిలమ్మ కూయగా
తెలంగాణకొచ్చేనే బతుకమ్మ పండుగ

కమ్మగుండె గూటికి… ఆడపడచు ఆటకి
గునుగు పూల తోటకి ఏనుగు మీద తేగకి
ఏరువాక ఎదలకి… ఏటిలోని అలలకి
కట్ల పూల కళ్ళకి… కానుకయ్యి పల్లకి
తరలి తరలి వచ్చెనే బతుకమ్మ
వరదలపై తరలిపోవు తన జన్మ

మెట్టినింటి పిలుపుతో వెళ్లిపోయే చెల్లెలా
జ్ఞాపకాల బరువులో చెమ్మగిల్లె తల్లిలా
ఆడబిడ్డ చెయ్యిని… తల్లి తల్లి గడపని
దాటిపోయే నీటిలో ఒదిగిపోయె వేళలో
సాగనంపి చెల్లెలు… చెరువు కొమ్మ చివరలో
మరల మరలి రమ్మని బతుకమ్మని వీడగా

అల్లిపూల వెన్నెల… చెరువులోన కురవగా
పూలఇంద్ర ధనస్సులే నేలమీద నిలవగా
కొమ్మలన్ని అమ్మలై వేల పూలు విరియగా
పుట్టమన్ను మట్టిలో… మట్టి గౌరి పుట్టగా

సై సై హయ్ హయ్
సై సై హయ్ హయ్
సై సై హయ్ హయ్
ఆ ఆ ఆఆ

టుంగుటుయ్యాల టుంగుటుయ్యాలో పాట‌..

ఈ పాట‌కు కందికొండ సాహిత్యం అందించ‌గా.. బోలేశావలి సంగీతం అందించారు. కనకవ్వ, జయశ్రీ, హనీలు ఈ పాట‌ను పాడారు.

వత్తాంటే పోతాంటే.. ఓ రామ సిలక
నడిసేటి ధారుల్లో.. మొలిసింధి మొలక
ఆ మొలకె చెత్తయ్యి.. కొమ్మల్నే వేసాయి
ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి
ఆ పువ్వే అంధంగా బతుకమ్మయ్యే..

టంగుతుయ్యాలో టంగుటూయాలా
కొమ్మలపూలే కోసియ్యాల

టంగుతుయ్యాలో టంగుటూయాలా
కొమ్మలపూలే కోసియ్యాల
టంగుతుయ్యాలో టంగుటూయాలా
రంగుల పూలే రాశి పొయ్యాల

ఓ నీలా చెరువులో నీరోచ్చే ఈ వేలా
ప్రతి ఒక్క పువ్వులతో బతుకమ్మ బెర్చలి
తలకెత్తి గోరమ్మను తరలెల్లాలే
అలలు చెరువు గట్టుమీధ ఆట లాడాలే

టంగుతుయ్యాలో టంగుటూయాలా
వలుగుమత్తడే తుంకే దియ్యాల
టంగుతుయ్యాలో టంగుటూయాలా
వాగు వంకలై ఊరికేనియ్యాలా

వత్తాంటే పోతాంటే.. ఓ రామ సిలక
నడిసేటి ధారుల్లో.. మొలిసింధి మొలక
ఆ మొలకె చెత్తయ్యి కొమ్మల్నే వేసాయి
ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి
ఆ పువ్వే అంధంగా బతుకమ్మయ్యే

ఆడ బిడ్డలే ఇల్లు నిండగా
అమ్మ నాన్నకే కనుల పండగ
కొత్త బట్టలే సెరెవంటినా
మట్టి గాజులే మెరిసే సేథినా

ఓ వానమ్మ కురవంగా
వరధమ్మ ఉరకంగ పచ్చగా విరిగింది
ఈ నేలంతా బతుకమ్మాయి మురిసిండి
ప్రతి పల్లెంత పండగాని చేసింది ఊరూరాంత

టంగుతుయ్యాలో టంగుటాయలో
టంగుతుయ్యాలో టంగుటూయాలా
పలహారపు వాయనాలు సేయ్ మాలాగా
టంగుతుయ్యాలో టంగుటూయాలా
తీపి తీపి రుసులతోటి నోరు ఊరగా

ఊరు ఊరులో వాడా వాడాలో
సంగిడిలాలే రంగుల పూలో
కోలో కోలో తొమ్మిదినాండ్లో
పాటలు విదిసే రాముల గుల్లో

ఓ మలిచేరే వయసంత చిందేస్తు చిన్న పెద‌
సంతోషం ఉప్పొంగే సత్తులబెలా
నేల మీదా ఉయ్యాలూగే
మా బతుకమ్మ సంబురంగబోయి మల్లి
తిరిగి రావమ్మ

టంగుతుయ్యాలో టంగుటాయలో
టంగుతుయ్యాలో టంగుటాయలో
బతుకమ్మ బతుకునిచ్చే
పూల పూజతో