గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. అయితే, గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ మరో నాలుగు రోజుల్లో జరుగుతుందనుకునే సమయంలో ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు మరోసారి రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా పరీక్ష నిర్వహించవద్దని గత రాత్రి అశోక్‌నగర్ వద్ద ఆందోళన చేపట్టారు.
తాజాగా గురువారం ఉదయం గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.దీంతో అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు. అభ్యర్థుల డిమాండ్లను విన్నాక ప్రభుత్వంతో మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.