గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై నేడే రిజల్ట్.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు.పరీక్షల నిర్వహణ సమయంలో టీజీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్ అంధకారంలో పడుతుందని పలువురు కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది. పరీక్షలో 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, పరీక్ష రద్దు చేయాలని పది మందికి పైగా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, పరీక్ష రద్దుకే హైకోర్టు మొగ్గుచూపుతుందా? లేదా పిటిషన్లను కొట్టివేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువడనుంది. ఈ నెల 21 నుంచి అనగా మరో 6 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news