ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. టీచర్లు ఇక ఆ పని చేయాల్సిందే!

-

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే విద్యార్థులకు అందజేస్తున్న భోజనం క్వాలిటీ పెంచేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వసతి గ‌‌ృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం మంగళవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

భోజనాన్ని తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి. రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి ఫుడ్ తినాలి. వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’ అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. దీని ద్వారా విద్యార్థుల డ్రాపౌడ్స్ తగ్గుతాయని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news