భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-మార్క్3 డీ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో లిస్ట్ లో మరో మైలురాయి చేరింది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 26.18 గంటలపాటు కొనసాగిన తర్వాత బుధవారం సాయంత్రం 5.08 గంటలకు.. జీఎస్‌ఎల్‌వీ-మార్క్3-డి2 వాహక నౌక.. 3,423 కిలోల బరువున్న జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చింది. 16.43 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది.. జియోసింక్రనస్ కక్ష్యకు చేరగానే ఇస్రో శాస్త్రవేత్తల ఆనందంలో మునిగిపోయారు. ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా ఉపగ్రహాన్ని తుది జియోస్టేషనరీ కక్ష్యలో ఉంచుతారు. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన ఐదో ప్రయోగమిది.
పదేళ్లపాటు సేవలు…
జీఎస్ఎల్వీ మార్క్3 ద్వారా ప్రయోగించిన జీశాట్29 ఉపగ్రహం పదేళ్లు సేవలందించనుంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కలిగిన ఉపగ్రహం 4,600 వాట్స్ సమార్థ్యం ఉన్న సోలార్ ఫ్యానెల్‌ను అమర్చారు. జియోహై రిజల్యూ యేషన్ కెమెరా ఆర్‌టికల్ కమ్యూనికేషన్ పేలుడు ఇందులో ఉన్నాయి. . డిజిటల్ ఇండియాలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అంతర్జాల సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రయోగం లక్ష్యం. ప్రధానంగా ఇది జమ్ముకాశ్వీర్, నార్త్ ఇండియాలోని మారుమూల గ్రామాలకు కమ్యూనికేషన్ సేవలందించనుంది.
ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎన్. శివన్ మాట్లాడుతూ… గగన వీధిలో యాత్రకు తాము సిద్ధమవుతున్నామన్నారు. 2021నాటికి మానవసహిత యాత్రకు శ్రీకారం చుడుతామని ప్రకటించారు.