ప్రస్తుతం నగరాల్లో ఓలా, ఊబర్ మరియు ఇతర యాప్స్ లో ఆటో బుకింగ్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కారు కంటే ఆటో తక్కువ ధరకే వస్తుంది. దాంతో సామాన్యులు ఎక్కువగా ఆటోనే బుక్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఆన్ లైన్ ఆటోలు బుక్ చేసినా కూడా జీఎస్టీ విధించేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది. జనవరి1 నుండి ఆటో బుకింగ్ పై జీఎస్టీ విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆటో బుకింగ్ పై 5శాతం జీఎస్టీ పడనుంది.
అయితే ఇది కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ఆటోలకు మాత్రమే వర్తించనుంది. ఇదిలా ఉండగా సామాన్యుడిపై జీఎస్టీ బాధుడు ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా గార్మెంట్స్ పై కూడా జీఎస్టీని పెంచుతూ కేంద్రం నిర్ణంయింది. దాంతో పాటు సినిమా టికెట్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులు హోటల్ లో ఇలా ప్రతిచోటా జీస్టీ బాధుడుతో సామాన్యుడు నడ్డివిరుస్తోంది కేంద్రం.