ఇల్లు కొందామనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త..!

-

సార్వత్రిక ఎన్నికలు వేళ కేంద్ర ప్రభుత్వం ఇల్లు కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రూ.45 లక్షల లోపు ఇల్లు కొనుగోలుపై జీఎస్టీని తగ్గించారు. ఇదివరకు 8 శాతంగా ఉన్న జీఎస్టీని 1 శాతానికి తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇల్లు కొనుగోలుదారులకే కాదు.. ఇల్లును నిర్మించుకోవాలనుకునే వాళ్లకు కూడా శుభవార్త ఉంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై కూడా జీఎస్టీని తగ్గించారు. ఇళ్ల నిర్మాణలపై 12 శాతంగా జీఎస్టీ ఉండేది. దాన్ని 5 శాతానికి తగ్గిస్తున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.

gst rates reduced for house construction

ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆయన నేతృత్వంలోనే ఈ కౌన్సిల్ సమావేశం జరిగింది. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కొనుక్కోవడానికి గానీ.. నిర్మించుకోవడం కోసం గానీ ముందుకు వస్తాయని.. వాళ్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news