నాని గ్యాంగ్ లీడర్ టీజర్..!

-

నాచురల్ స్టార్ నాని విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా గ్యాంగ్ లీడర్ అని ఫిక్స్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. నాని అతనితో ఓ ఐదుగు ఆడవాళ్ల ప్రయాణమే ఈ సినిమా. అయితే ఆ లేడీస్ కు లీడర్ గా గ్యాంగ్ లీడర్ గా నాని కనిపించనున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ లీడర్. అలాంటి సూపర్ హిట్ టైటిల్ నానికి ఇవ్వడం గొప్ప విషయమే. రాం చరణ్ ఎప్పటికైనా ఆ టైటిల్ తో సినిమా చేస్తాడని అనుకున్నారు. కాని ఆ ఛాన్స్ నానికి దక్కింది. ఈ టైటిల్ పై మెగా హీరోలు ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం విశేషం. మొత్తానికి నాని గ్యాంగ్ లీడర్ ఎలా ఉంటుందో చూడాలి. రిలీజైన టీజర్ బాగుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news