ఉద్యోగుల దంపతుల బ‌దిలీపై మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

-

తెలంగాణ రాష్ట్రలో ఉద్యోగ దంప‌తుల బ‌దిలీపై రాష్ట్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా భార్య‌భ‌ర్తలు ఒకే చోట ప‌ని చేసేలా.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ముఖ్య కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కొత్త జోన‌ల్ కేటాయింపుల్లో చేరిన త‌ర్వాతే ఉద్యోగుల్లో ఉండే భార్య భ‌ర్త‌లు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపారు. కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ లో కేటాయింపులు అయిన త‌ర్వాతే భార్య భ‌ర్తల బ‌దిలీ విష‌యం లో ఆలోచిస్తామ‌ని తెలిపారు.

కానీ త‌ప్ప‌కుండా దంప‌తుల బ‌దిలీలు ఉంటాయ‌ని తెలిపారు. భార్య భ‌ర్తల ద‌ర‌ఖాస్తులు జిల్లా కేడ‌ర్ ఉద్యోగులు జిల్లా శాఖ అధిప‌తికి ఇవ్వాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అలాగే జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ ఉద్యోగులు ఆయా శాఖ అధి ప‌తుల‌కు ద‌ర‌ఖాస్తులు ఇవ్వాల‌ని అన్నారు. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియా ముగిస‌న త‌ర్వాత సంబంధిత శాఖ కార్య‌ద‌ర్శ‌కి సిఫార‌సు చేస్తామ‌ని సీఎస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news