తస్సాదియ్యా..ట్రంప్ పర్యట కోసం నిమిషానికి 55 లచ్చల ఖర్చా..!!

-

అగ్ర రాజ్యాధిపతి ఇండియా వస్తున్నాడంటే మాటలా మురికివాడలు కూడా ఇంద్ర భవనాలుగా మారిపోతాయి. అల్లదుగో ఆకసమంతా పందిరేసి అన్నట్టుగా ఊరు ఊరు మొత్తం సోకులు సేసేత్తారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. ట్రంప్ పర్యటన మాటేమో కాని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రజలకి మాత్రం మహార్ధస పట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల రూపాయలు కేవలం అహ్మదాబాద్ అభివృద్ధి కోసం వెచ్చించాయి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు….దీని వెనుక అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా సరే ఇప్పుడు ఈ 100 కోట్ల ఖర్చు పై పెద్ద చర్చే నడుస్తోంది….

అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24 తేదీన భారత్ లో పర్యటన మొదలు పెట్టనున్నారు. సుమారు రెండు రోజుల పాటు ఈ పర్యటన జరుపుకుంటున్న ట్రంప్ దంపతులు. భారత్ లో వివిధ సమస్యలు, అభివృద్ధి పనులు వగైరా వగైరా తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే ట్రంప్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ని ప్రారంభించబోతున్నారు. అంతేకాదు దాదాపు లక్ష మందిని ప్రజలని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించబోతున్నారు కూడా. అయితే..

 

ట్రంప్ ఈ కార్యక్రమం కోసం గుజరాత్ లో 3 గంటల పాటు గడపనున్నారు. ఈ మూడుగంట సమయానికి గాను ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నిమిషానికి 55 లక్షలు. అంటే సుమ్మారు 100కోట్ల పైమాటే. ఇప్పటికే 60 కోట్ల రూపాయలతో రోడ్ల సుందరీ కరణ పనులు, అత్యంత ఆధునీకరణమైన విద్యుత్ అలంకరణలు ఇలా ట్రంప్ స్వాగత కార్యక్రమం కోసం ఖర్చు చేయగా మరిన్ని పనుల కోసం ఇంకా 40 కోట్లు ఖర్చు అవుతుందని స్థానిక మునిసిపల్ అధికారు తెలిపారు. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని తెలిపారు. గుజరాత్ ముఖ్య మంత్రి విజయ్ రూపాణి మాట్లాడుతూ ట్రంప్ కి ఇచ్చే ఆతిధ్యం విషయంలో ఎక్కదా రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో గుజరాత్  ప్రజలు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news