మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగిన కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు జరిమానా

-

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు శుక్రవారం గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాని మోదీ చదివిన డిగ్రీ వివరాలను అందించాలని ఆర్.టి.ఐ ద్వారా కేజ్రీవాల్ కోరారు. ఈ క్రమంలో వివరాలు ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశించింది.

అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు జరిమానా విధించింది న్యాయస్థానం. ప్రధాని మోదీ సర్టిఫికెట్ల అంశం ప్రజలకు సంబంధించిన విషయమా? అంటూ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ పిటిషన్ వేసిన కేజ్రీవాల్ కు 25 వేల జరిమానా విధించింది. మోడీ సర్టిఫికెట్లను చూపించవలసిన అవసరం పీఎంవోకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీరెన్ వైష్ణవ్ తో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఈ మేరకు తీర్పు విలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news