గర్భిణీ మహిళను చంపి..వాళ్ళ నాన్న ఫాం హౌస్ లోనే పూడ్చాడు !

గర్భవతి అయిన తన లైవ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని గుజరాత్ బార్డోలి పట్టణంలో ఖననం చేసినందుకు గాను అమన్ అనే వ్యక్తి అరెస్టయ్యాడు. ఆమె మృతదేహం ఆమె తండ్రికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో కనుగొన్నారు. ఇది ఆమె నిందితుడితో కలిసి నివసించిన ప్రదేశానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్ 14న బాధితురాలు రష్మీ కటారియా తన మూడేళ్ల బిడ్డను తల్లిదండ్రుల వద్ద వదిలివేసి జాడ లేకుండా పోయింది. ఆమె చాలా రోజుల కనిపించకపోవడంతో ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయతే అప్పటికే ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలిసింది.

గత ఐదేళ్లుగా చిరాగ్ పటేల్ అనే వ్యక్తితో ఆమె లైవ్-ఇన్ రిలేషన్‌లో ఉందని కుటుంబం తెలిపింది. రష్మి అదృశ్యం గురించి పోలీసులు చిరాగ్‌ను ప్రశ్నించగా, అతను ఆమెను చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆమెను గొంతు కోసి చంపానని మరియు మృతదేహాన్ని ఆమె తండ్రి వ్యవసాయ క్షేత్రంలోనే పూడ్చనని పోలీసులకు చెప్పాడు. అక్కడ అతను జెసిబి ఎక్స్కవేటర్ ఉపయోగించి ఒక గొయ్యి తవ్వి, అందులో మృతదేహాన్ని పూడ్చాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. చిరాగ్ పటేల్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణలో, వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నందుకే తన భాగస్వామిని చంపాడని వెల్లడించాడు. ఈ నేరంలో చిరాగ్ మొదటి భార్య పాత్రను పోలీసులు అనుమానిస్తున్నారు, ఎందుకంటే ఆమె కొన్ని నెలల క్రితం రష్మీతో గొడవపడి ఆమెను తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది.