దంతాలు, చిగుళ్ల సమస్యలు లేకుండా చూడడంతోపాటు నోటి శుభ్రతను పాటిస్తే కోవిడ్ తీవ్రతరం కాకుండా ఉంటుందని సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. చిగుళ్ల సమస్యలు ఉన్నా, నోటి శుభ్రత సరిగ్గా పాటించకపోయినా కోవిడ్ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన పీరియాడింటిస్ట్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీరియడోంటాలజీలో సైంటిస్టులు ఓ నివేదికను ప్రచురించారు.
నోటి శుభ్రతకు, కోవిడ్ తీవ్రతరం అయ్యేందుకు దగ్గరి సంబంధం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. డాక్టర్ జేమ్స్ జి.విల్సన్ అందజేసిన పై నివేదిక ప్రకారం.. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ల ద్వారా కోవిడ్ తీవ్రతరం కాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. ఇక ఇదే విషయమై కెనడాకు చెందిన మాంట్రియల్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం కూడా నివేదికను అందజేసింది.
నోటి పరిశుభ్రతను పాటిస్తే కోవిడ్‌ను తీవ్రతరం కాకుండా ఆపవచ్చని, కానీ చిగుళ్లు, దంతాల సమస్యలు ఉన్నవారిలో కోవిడ్ తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయని, అలాగే వారు కోవిడ్‌తో చనిపోయే అవకాశాలు 8.8 రెట్లు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అలాగే నోటి శుభ్రత పాటించనివారు హాస్పిటల్‌లో చేరేందుకు 3.5 రెట్లు, వెంటిలేటర్ అవసరం అయ్యే శాతం 4.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ఎవరైనా సరే నోటి శుభ్రతను పాటించాలని, దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.