బే ఆఫ్ బెంగాల్ మీదుగా రానున్న యాస్ తుఫాను కు భారత నావికదళం అప్రమత్తం అయింది. ఉత్తర అండమాన్ సముద్రాలతో అల్పపీడన ప్రాంతం తుఫానుగా మారే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ మద్య ఈనెల 26 నాటికి తీరం దాటే ఆవకాశం ఉందని అంటున్నారు. యాస్ తుఫానులో భాగంగా ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ కు…
భారతనావికదళం 8 వరద సహాయ బృందాలు, 4 డైవింగ్ బృందాలు చేరుతాయి. అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించడానికి 4 నావిక దళాలు, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ( HADR), డైవింగ్, వైద్య బృందాలతో సంసిద్దం అయ్యారు. నావల్ ఎయిర్ స్టేషన్ లలో, విశాఖలో ఐఎన్ఎస్ డేగాతో పాటు చెన్నైలో ఐఎన్ఎస్ రాజాలిలో నావికదళ విమానాలను భారత నావికదళం సిద్దం చేసింది.