గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO జాబ్ నోటిఫికేషన్ విడుదల..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తాజాగా గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్-DMHO జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… దీనిలో 324 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈఓ లాంటి పోస్టులున్నాయి.

 

jobs
jobs

ఈ పోస్టులకు ఆఫ్‌ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2021 సెప్టెంబర్ 30. నేషనల్ హెల్త్ మిషన్‌కు చెందిన డిస్ట్రిక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లో ఈ ఖాళీలున్నాయి. జిల్లా లోని వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. స్టాఫ్ నర్స్ (కాంట్రాక్ట్) పోస్టులు 137 వున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అవ్వాలి. అలానే ల్యాబ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) 47 ఖాళీలు వున్నాయి. ఈ పోస్ట్స్ కి అప్లై చెయ్యాలంటే సైన్స్‌లో 12వ తరగతి పాస్ కావడంతో పాటు మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి.

అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఓట్ సోర్సింగ్) 69 ఖాళీలు వున్నాయి. డిగ్రీతో పాటు పీజీడీసీఏ పాస్ అయ్యిన వాళ్ళు వీటికి అప్లై చెయ్యచ్చు. ఎల్‌జీఎస్ (ఓట్ సోర్సింగ్) 71 ఖాళీలు వున్నాయి. అప్లై చెయ్యాలంటే 10వ తరగతి పాస్ కావాలి. వయస్సు 2021 సెప్టెంబర్ 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 ఏళ్ల లోపు. ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు 50 ఏళ్ల లోపు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి కేవలం ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే.

నోటిఫికేషన్ : https://cdn.s3waas.gov.in/s30777d5c17d4066b82ab86dff8a46af6f/uploads/2021/09/2021092217.pdf

Read more RELATED
Recommended to you

Latest news