రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సత్యదేవ్, తమన్నా ల ‘గుర్తుందా శీతాకాలం’

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇటీవల ‘గాడ్సే’గా..తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. త్వరలో సత్యదేవ్ నటించిన లవ్ స్టోరి ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నాయి.

 

శాండల్ వుడ్(కన్నడ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’..డెఫినెట్ గా తెలుగులో హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో సత్యదేవ్, తమన్నా భాటియాల రొమాన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్.

ఇప్పటికే చాలా సార్లు విడుదల తేదీలను ప్రకటించి వాయిదా వేసిన మేకర్స్ తాజాగా..అఫీషియల్ గా మరో విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ నెల 9న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. నాగశేఖర్ దర్వకత్వం వహించిన ఈ సినిమాలో..సీనియర్ హీరోయిన్ సుహాసిని మణి రత్నం కీలక పాత్ర పోషించింది.

Read more RELATED
Recommended to you

Latest news