జాతకంలో గురు గ్రహం దోష నివారణకు ఈ స్తోత్రం చదివితే చాలు !

-

నవగ్రహాలు… జాతకాన్ని నిర్దేశించే గ్రహాలు. అందులో గురు గ్రహం అతి ప్రధానమైనది. దీని ప్రభావంతో జీవితంలో పలు కార్యాలను సులభంగా జయించవచ్చు. గురువు బాగుంటే అన్ని బాగున్నట్లే అనే నానుడి కూడా ఉంది. అయితే ఈ ప్రధాన గ్రహ అనుగ్రహం ఉంటే విద్య, ఉపాధి, ఉద్యోగం, కార్యజయం, వివాహం, సంతాన సమస్యలు తీరుతాయని జ్యోతిషుల మాట.

అయితే ఈ గ్రహదోషం ఉన్నవారు రకరకాల పూజలు, జపాలు, హోమాలు చేయించాలి. కానీ ఇవి అందరికీ సాధ్యం కావు. కాబట్టి సులభంగా, శ్రీఘ్రంగా ఒక గ్రహ దోషం నివారణ అంటే ఆ గ్రహాన్ని భక్తితో ప్రార్థించడం, ధర్మబద్ధంగా నడుచుకోవడం చేస్తే చాలు. శాస్త్రంలో చెప్పిన సులభమైన ఈ గురు స్తోత్రం ప్రతీరోజు భక్తితో పఠిస్తే తప్పక గురుదోషం పోతుంది. అదేవిధంగా దోషం లేనివారికి గురువు మరింత అనుగ్రహించి తలచిన, చేపట్టిన కార్యాలను దిగ్విజయంగా పూర్తిచేస్తాడు. ఆ స్తోత్రం ….

” అస్య శ్రీబృహస్పతికవచస్తోత్రమన్త్రస్య ఈశ్వర ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, గురుర్దేవతా, గం బీజం, శ్రీశక్తిః,
క్లీం కీలకం, గురుప్రీత్యర్థం జపే వినియోగః|
అభీష్టఫలదం దేవం సర్వజ్ఞం సురపూజితమ్|
అక్షమాలాధరం శాన్తం ప్రణమామి బృహస్పతిమ్|| ౧||
బృహస్పతిః శిరః పాతు లలాటం పాతు మే గురుః|
కర్ణౌ సురగురుః పాతు నేత్రే మేऽభీష్టదాయకః|| ౨||
జిహ్వాం పాతు సురాచార్యో నాసాం మే వేదపారగః|
ముఖం మే పాతు సర్వజ్ఞో కణ్ఠం మే దేవతాగురుః|| ౩||
భుజావాఙ్గిరసః పాతు కరౌ పాతు శుభప్రదః|
స్తనౌ మే పాతు వాగీశః కుక్షిం మే శుభలక్షణః|| ౪||
నాభిం దేవగురుః పాతు మధ్యం పాతు సుఖప్రదః|
కటిం పాతు జగద్వన్ద్య ఊరూ మే పాతు వాక్పతిః|| ౫||
జానుజఙ్ఘే సురాచార్యో పాదౌ విశ్వాత్మకస్తథా|
అన్యాని యాని చాఙ్గాని రక్షేన్మే సర్వతో గురుః|| ౬||
ఇత్యేతత్కవచం దివ్యం త్రిసన్ధ్యం యః పఠేన్నరః|
సర్వాన్కామానవాప్నోతి సర్వత్ర విజయీ భవేత్|| ౭||
|| ఇతి శ్రీబ్రహ్మయామలోక్తం బృహస్పతికవచం సమాప్తం| ” ః

దీన్ని ప్రతిరోజు విడవకుండా భక్తితో, శుచితో పఠిస్తే తప్పక లాభం కలుగుతుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news