“గురుద్వార” లో ఇద్దరు మహిళల పెళ్లి.. ఆగ్రహించిన కమిటీ !

-

ఈ సమాజంలో ఏ విధంగా అయినా జీవించడానికి మన రాజ్యాంగం వెసులుబాటును కల్పించింది. కాగా టెక్నాలజీ వృద్ధి చెందుతున్న ఈ దేశంలో స్వలింగ సంపర్కులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నారు, ఒక అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదే విధంగా ఒకబ్బాయి మరో మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తరచూ జరుగుతున్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పంజాబ్ లోని భటిండా లో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుద్వారా లో ఈ నెల 18న మనీష మరియు డింపుల్ అనే ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇలా గురుద్వారాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం సిక్కు మతానికి విరుద్ధం అని తెలిసిందే. ఈ ఘటనపై శిరోమణి గురుద్వార కమిటీ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించిన గ్రంధి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరిపించాలని ఆదేశించడం జరిగింది. ఇక ఈ విషయంపై వివాదం చెలరేగడంతో తప్పు తెలుసుకుని గ్రంధి సింగ్ క్షమాపణలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news