రేపటి నుండి స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్ డే ల సిరీస్ ను ఆడనుంది ఇండియా. అందులో భాగంగా ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు పంజాబ్ కు చేరుకున్నారు… రేపు మధ్యాహ్నం 1 .30 గంటలకు మొహాలీ వేదికగా మొదటి వన్ డే జరుగనుంది. ఇండియా జట్టును కె ఎల్ రాహుల్ ముందుండి నడిపించనున్నాడు. మొదటి రెండు వన్ డే లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియా జట్టు కీలక ప్లేయర్ లు ఇద్దరు లేకుండానే ఇండియాతో తలపడడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరియు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ లేకుండానే మొదటి వన్ డే ఆడనుంది. ఇక ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
మరి మొదటి వన్ డే లో ఎవరు గెలుస్తారు ? ప్రపంచ కప్ కు ముందు జరగనున్న ఈ సిరీస్ తో ఎవరు లాభం పొందుతారు అన్నది తెలియాలంటే వాటి చేయాల్సిందే.