అందుకే విష్ణుని పెళ్లి చేసుకున్నా… గుత్తా జ్వాల..!

-

విష్ణు విశాల్ రాక్షసన్ సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా మాత్రమే కాకుండా నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన బీమీలి కబడ్డీ జట్టు సినిమా కూడా ఈయన హీరోగా నటించిన సినిమనే.

డిఫరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకుల అలరించిన విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్. ఈ సినిమాకు మను ఆనంద్ దర్శకత్వం వహించాడు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ తమిళ సినిమా తెలుగులో కూడా ఒకే రోజు విడుదల కాబోతుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం తాజాగా మీడియాతో ముచ్చటించింది.

అందులో భాగంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు అని అందరూ అడుగుతుంటారుకదా..? అందుకే ఓ హీరోని పెళ్లి చేసుకున్నాను అని విష్ణు విశాల్‌ను చూపిస్తూ గుత్తా జ్వాలా నవ్వుకుంది. ఈ మూవీ కోసం విష్ణు అండ్ టీం చాలా కష్టపడ్డారు అని గుత్తా జ్వాల చెప్పుకచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news