అబ్బాయిలూ మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా.. అయితే మీకే నష్టం తెలుసా..?

-

మనం పుట్టడంతోనే.. మనకు ఎన్నో రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. అమ్మానాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు, బాభై, పిన్నీ, అత్త, మామ ఇలా బోలెడు.. వీటిని ఎంచుకోవడం మన చేతుల్లో ఉండదు. కానీ ఒక్క స్నేహాన్ని మాత్రమే మనిషి ఎంచుకోగలడు.
స్నేహబంధం అన్ని బంధాలకంటే చాలా గొప్పది. అందులోనూ.. అమ్మాయికు బాయ్ బెస్టీ, అబ్బాయికి గర్ల్ బెస్టీ రిలేషన్ అయితే వీర లెవల్ అంతే. అయితే కొందరు.. అమ్మాయిలంటే.. అబ్బాయిల జేబులు ఖాళీ చేస్తారనే అనుకుంటారు. కానీ అబ్బాయిలు మీ జీవితంలో ఒక్క అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదంటే.. మీకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా..?
మగాడి జీవితంలో ఆడవాళ్ల పాత్ర చాలా ముఖ్యం. బాధలో ఓదార్పుగా, సంతోషంలో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ, అవసరమైనప్పుడు సలహాలిస్తూ, ట్రాక్ తప్పినవాడిని దారిలో పెడుతూ, ప్రతి విషయంలోనూ తోడుగా నిలుస్తుంది అమ్మాయి.. అందుకే ప్రతి అబ్బాయి లైఫ్ లో బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలంటున్నారు నిపుణులు.
అబ్బాయిలు దూకుడుగా వ్యవహరిస్తే సమస్య పరిష్కారమయ్యే ఉపాయం అమ్మాయిలు ఆలోచిస్తారు. కష్టం ఎక్కువైతే ఓదారుస్తారు. మనసుకి నచ్చే మాట చెబితే చిన్న హగ్‌ ఇచ్చి సంతోషం రెట్టింపు చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పే కాదు సంతోషాలు, సరదాలులు వాళ్లదగ్గరే దొరుకుతాయి.
ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటుందో, ఎలా ఆలోచిస్తుందో మరో అమ్మాయికి మాత్రమే అర్థమవుతుంది. ప్రేమ, పెళ్లి విషయంలో నిరభ్యంతరంగా మీరు మీ గర్ల్ బెస్టీ సలహాలు తీసుకోవచ్చు. ఓ ఫ్రెండో, ప్రేమికురాలో ఉంటే అబ్బాయిలకు ఆసలు షాపింగ్ సమస్యే ఉండదు. ఆచితూచి కొనడంలో అమ్మాయిల్ని మించిన వారు ఎవరూ ఉండరు. గొడవలు, వివాదాలప్పుడు ఆలోచన లేని ఆవేశం అబ్బాయిలది. ఆ ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటారు.
సమస్యల్లో ఇరుక్కుంటారు. అలాంటి సమయంలో సైడ్‌ ట్రాక్‌ పట్టినవాళ్లని వెనక్కిలాగి సరైన దారిలో పెట్టేది అమ్మాయిలే. అమ్మాయిలకు అబ్బాయి నచ్చాలే గానీ అమ్మలా, సోదరిలా ప్రేమను కురిపిస్తారు. తోచినంత సాయం చేస్తుంటారు. కుర్రాళ్ల రహస్యాలు దాస్తారు. జీవితంలో ఎదిగేలా ప్రేరణ కలిగిస్తారు. అయితే.. అమ్మాయిల్లో కూడా కతర్నాక్ లు ఉంటారు.. మోసం చేసే కేటుగాళ్లు ఉన్నారు. కాబట్టి.. మంచి గర్ల్ బెస్టీని ఆచితూచి సెలెక్ట్ చేసుకున్నారంటే.. కొండంత అండ దొరికినట్లే.. అలాగే అమ్మాయిలకు కూడా బాయ్ బెస్టీ అవసరం ఎంతో ఉంటుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news