ఏపీలో సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిన సమయం వచ్చింది : జీవీఎల్ సంచలనం

-

తిరుపతిలో జీవీ ఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువ్యతిరేక విధానాలను వైసీపీ, టీడీపీ రెండూ  పాటిస్తున్నాయి. వాటిని ప్రచారం చేయటానికి తిరుపతి ఉప ఎన్నికలు మంచి అవకాశం ఉందని అన్నారు. పోలీస్ స్టేషన్ లో  క్రిస్మస్ సంబరాలు చేయటం  విడ్డూరం. క్రిస్టియానిటీని ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. అధికారులు, రాజకీయ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. క్రైస్తవ టోపీలతో పోలీస్ స్టేషన్ లో పని చేయటం ఏమిటి? దసరా సంబరాలు చేశారా? ఒక మతాన్ని అధికారంతో తీసుకురావటానికే ఇలాంటి చర్యలు అని అయన కామెంట్ చేశారు.

పోలీస్ స్టేషన్ మత ప్రచారానికి వేదిక కాదు. అయ్యప్ప మాల వేసినపుడు, బొట్టు పెట్టినపుడు అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం ఇలా సామూహికంగా క్రిస్మస్ వేడుకలు పోలీస్ స్టేషన్ లో నిర్వహింపజేస్తారా? వై.సి.పి ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న మత మార్పిడిలపై బి.జె.పి తీవ్రంగా పోరాడుతుందని అయన అన్నారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ర్టయిక్ అవసరమైతే… ఏపీలో ట్విన్ ఎలక్ర్టోల్ సర్జికల్ స్ట్రయిక్స్ అవసరం అంటూ ఆయన కీలక కామెంట్స్ చేశారు. 3200 కోట్ల బడ్జెట్ టీటీడీ బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే హిందు మత ప్రచారానికి టీటీడీ ఖర్చు పెడుతోందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news