తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగ భగ మండి పోతున్నాయి. మొన్నటి వరకు చలి విపరీతంగా ఉండగా… గత వారం రోజుల నుంచి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించబోతున్నట్లు ఇప్పటి కే ప్రకటన చేసింది.
మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభించబోతున్నట్లు నిన్న ప్రకటన చేయగా… తాజాగా మరో ప్రకటన చేసింది. రేపటి నుంచే అంటే మార్చి 15 వ తేదీ నుంచే ఒంటిపూట తరగతులు ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది సర్కార్. ఉదయం 7:45 గంటల నుంచి 12 గంటల వరకు అంటే రోజూ నాలుగున్నర గంటల పాటు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఒంటిపూట బడులు.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.