హాఫ్ మిలియన్ లైకులతో దూసుకుపోతున్న సారంగ దరియా..

-

సినిమాకి జనాలని ఆకర్షించాలంటే అందులో వారికి నచ్చినదేదో ఒక అంశం ఖచ్చితంగా ఉండాలి. ఆ అంశం పాటలే అయితే సినిమా రీచ్ ఎక్కువగా ఉంటుంది. అంతటి రీచ్ చేరుకున్న పాట ఏదైనా ఉందంటే అది సారంగ దరియా అనే చెప్పాలి. నాగ చైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రంలోని సారంగ దరియా పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. అప్పటి వరకూ లవ్ స్టోరీ సినిమా గురించి తెలియని వాళ్ళు కూడా ఈ సినిమా గురించి సారంగ దరియా పాట ద్వారా తెలుసుకుంటున్నారు.

తెలంగాణ జానపద గేయాన్ని అద్భుతంగా వెండితెర మీద ఆవిషృతం చేసినట్టుగా అనిపిస్తోన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు 17మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ పాట హాఫ్ మిలియన్ల లైకులని సంపాదించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ఇంతలా పాపులర్ అయిన పాట ఈ మధ్య కాలంలో రాలేదు. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఆకట్టుకోవడమే కాకుండా భాష రాని వారు కూడా పాడుకునేలా చేస్తుంది. ఇక సాయి పల్లవి డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news