డిసెంబర్ లో హన్సిక పెళ్లి.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. చిన్న వయసులోనే గ్లామర్ షో తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ యాపిల్ బ్యూటీగా కూడా పేరు పొందింది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రకారులు సైతం మంత్రముగ్ధులవుతూ ఉంటారు. అయితే హన్సిక పెళ్లి పీటలెక్కబోతుంది. ఇది కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఆమె చేసుకోబోయే వరుడిపై కూడా నిన్నమొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

రెండు రోజుల క్రితమే హన్సిక బాయ్ ఫ్రెండ్ కం కాబోయే భర్త వివరాలు బయటకు వచ్చాయి. హన్సిక బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కుతూరియాతో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న హన్సిక ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్, జైపూర్ ప్యాలెస్ లో హన్సిక పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు పెళ్లి విషయమై మౌనంగా ఉన్న హన్సిక ఫైనల్ గా తాను చేసుకోబోయే వాడి వివరాలు, వరుడిని, పెళ్లి విషయమై సూపర్ క్లారిటీ ఇచ్చింది. ఈఫిల్ టవర్ వద్ద లవ్ సింబల్ అనే కామెంట్ తో హన్సిక తన పెళ్లి విషయాన్ని ఓ బ్యూటిఫుల్ పిక్చర్ తో కన్ఫర్మ్ చేసింది. రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో హన్సిక పెళ్లి ఓ నాలుగు రోజులపాటు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news