మూడేళ్లకే హీరోయిన్గా మారిన హన్సిక.. కట్ చేస్తే..!

-

చిన్నారిపై లైంగిక వేధింపుల కథాంశంతో 2004లో బాలీవుడ్లో జాగో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో పాపులర్ అయింది హన్సిక. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈమె 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు సంబంధం ఏమిటంటే.. జాగో సినిమాలో చిన్న పిల్లగా కథలో ప్రధాన పాత్రను పోషించిన హన్సిక మోత్వాని దేశ ముదురులో హీరోయిన్గా నటించడమే ఇప్పుడు వైరల్ గా మారిన అంశం.. కేవలం మూడేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ కావడం అప్పట్లోనే చర్చగా నిలిచింది.

మూడేళ్ల లోపు వ్యవధిలోనే చైల్డ్ ఆర్టిస్టు కాస్త హీరోయిన్గా మారడంతో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా హన్సిక ఎలా అంత త్వరగా హీరోయిన్ అయింది అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. అసలు విషయంలోకి వెళితే జాగో సినిమాతోనే కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక అప్పటికే బాలీవుడ్లో మంచి పరిచయస్తురాలు.. ఉన్నట్టుండి హీరోయిన్గా తెరపై కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . అదే సమయంలో ఆమె హార్మోనల్ ఇంజక్షన్లు తీసుకొని యుక్త వయసుకు ఎదిగినట్టుగా కనిపిస్తోందని రూమర్లు కూడా వచ్చాయి.

అయితే ఆ రూమార్లు ఒక హన్సిక మీదే కాదు మరి కొంతమంది హీరోయిన్లపై కూడా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి చైల్డ్ ఆర్టిస్టు నుంచి సినిమా హీరోయిన్లైన వారిపై కూడా ఇలాంటి రూమర్లు రావడం జరిగింది. కానీ ఈ రూమర్లపై ఆమె తల్లి ఇప్పుడు స్పందించింది.. అవన్నీ బోగస్ అని కొట్టి పడేసింది.. ఒకవేళ తన కూతురికి తాను హార్మోనల్ ఇంజక్షన్లు ఇచ్చి ఉండాలంటే తను చాలా ధనికురాలని అయి ఉండాలని.. హన్సిక తల్లి వ్యాఖ్యానించారు. టాటా, బిర్లా స్థాయి ధనుకులు మాత్రమే అలాంటి ఇంజెక్షన్ లు కొనగలరని ఆమె వ్యాఖ్యానించారు. సెన్స్ లేకుండా రాసే వాళ్ళు అలాంటి వార్తలు ఎలా రాస్తారు అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మొత్తానికైతే హన్సిక తల్లి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news