తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతకుముందు తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. తారక్ పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. అయితే, తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతరం విజయ సాయిరెడ్డితో ముచ్చటించారు. ఆయన పక్కకు కూర్చొని.. తారక రత్న గురించి, మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.