Hanuman : హనుమాన్ సినిమాను చూసిన నందమూరి బాలకృష్ణ…. ఏమన్నాడంటే

-

తేజ సజ్జా, అమృత అయ్యర్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం హనుమాన్.ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు . జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుని భారీ వసూళ్ళను రాబట్టింది. హనుమాన్ ఒక చిన్న మూవీ గా విడుదలై రూ. 100 కోట్లను రాబట్టింది. ప్రశాంత్ వర్మ థియేటర్ల విషయంలో వివాదాలను అందుకున్నా కూడా పట్టు వదలకుండా సినిమాను విడుదల చేసి హిట్ అందుకున్నాడు.

ఈ మూవీ సక్సెస్ పై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు కూడా ఎంతో మెచ్చుకున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ కు చిత్ర బృందం స్పెషల్ స్క్రీనింగ్ చేసి చూపించారు. బాలకృష్ణ ఈ మూవీని చూసి సంతోషించినట్లు మొత్తం చిత్ర బృందాన్ని ప్రశంసించినట్టు సమాచారం. ప్రశాంత్ వర్మ అన్ స్టాపబుల్ షో కు ప్రోమోలు చేసింది వర్మనే కాబట్టి వర్మ ని బాలయ్య మెచ్చుకొచ్చాడు. ఇక వీరిద్దరి జంటలో ఒక మూవీ రానుందని టాక్. నందమూరి కి ఒక కథ చెప్పాడు. దీనికి బాలయ్య ఇంకా ఓకే చెప్పలేదని, ఓకే అంటే సెట్స్ పైకి వెళ్తుందని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news