సికింద్రాబాద్‌లో తాడ్‌బండ్‌లో హనుమాన్‌ విజయోత్సవాలు

-

రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భారీ సంఖ్యలో హనుమాన్ దీక్షాపరులు పాల్గొంటున్నారు. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులంతా ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తారు. ఉదయాన్నే ఆ పవనసుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ తాడ్‌ బంద్‌ హనుమాన్‌ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సువర్చల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని వారంత ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచి స్వామి వారికి యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news