ఆంజనేయస్వామి.. ధైర్యానికి ప్రతీక. సకల రాక్షల సంహరుడు హనుమాన్. ఆంజనేయుడు మహా బలవంతుడు, భూత ప్రేత పిశాచాలను, దుష్ట శక్తులను తరిమి కొట్టేవాడు. ఆయనను తలచుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి. ఈ స్వామికి చెందిన కింది శ్లోకాన్ని నిత్యం పఠిస్తే సకల భయాలు పోతాయి. ఆ శ్లోకం…
‘‘మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి’’
వాయువేగ మనో వేగాలతో ప్రయాణించగలవాడు, ఇంద్రియాలను జయిం చినవాడు, బుద్ధిమంతుడు, అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు. వానర యోధులలోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.
భక్తి, శ్రద్ధలతో ఆంజనేయస్వామి ఆరాధన అన్ని రకాల శుభాలను ఇస్తుంది. భయాలను పోగొడుతుంది.
– శ్రీ