హనుమాన్ సినిమా పది రోజుల్లో ఎన్ని కోట్లని కలెక్ట్ చేసిందో తెలుసా..?

-

తేజ సజ్జ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత హీరోగా వచ్చి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. తేజ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది. జనవరి 11న ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ని సంపాదించుకున్నా ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇటీవల 100 కోట్లని క్రాస్ చేసేసింది. హనుమాన్ సినిమా ఇప్పుడు ఏకంగా 200 కోట్ల గ్రోస్ మార్కెట్ కి దగ్గర అయింది సినిమా రిలీజ్ అయి పది రోజులు అయినా కూడా కలెక్షన్లు తగ్గలేదు. ఇదే జోరుతో కొనసాగితే 300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 28.2 కోట్ల థియేటర్కల్ బిజినెస్ చేసింది పది రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ 105. 08 కోట్లు షేర్ ని రాబట్టింది ఇప్పటిదాకా 76.5 8 కోట్ల లాభాలని అందించింది కొద్ది రోజుల్లోనే 300 కోట్లు రాబడుతుందని అంతా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news