కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సీరియస్ అయ్యారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో వున్నా కూడా ఏవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అసహనానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. విపక్ష నేతల మీదున్న కోపం తో రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయొద్దని చెప్పారు.
ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో మంత్రి కోమటిరెడ్డి కే తెలియదని అన్నారు నిమిషానికో మాట మార్చే రకం కోమటిరెడ్డి అని అన్నారు కోమటిరెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారని అన్నారు. కాంగ్రెస్లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓటేయాలని చెప్పింది ఎవరూ మర్చిపోలేదని అన్నారు. బీఆర్ఎస్ ని చీల్చడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాత తరం కూడా కాదని అన్నారు