కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలతో రైతుల కళ్లలో ఆనందం.. బండి సంజయ్ ట్వీట్..!

-

నూతన సంవత్సర వేళ దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంట నష్టం చెల్లింపులకు ఉద్దేశించిన పీఎం ఫసల్ బీమా యోజన నిధిని రూ.69, 515 కోట్లకు పెంచింది. 50 కేజీల DAP బస్తాను రూ.1,350 కే సరఫరా చేయనుంది. రూ.3,850 కోట్లు కేటాయించింది. దీంతో దాదాపు 4 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు హర్శనీయం.అన్నదాత కళ్లలో ఆనందం నింపడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అండగా నిలిచిన పీఎం ఫసల్ బీమా యోజనతో పాటు పునర్ వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్శనీయం అని సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్. 

Read more RELATED
Recommended to you

Latest news