AA “ది బ్రాండ్‌”.. #HBDAA హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్…!

-

టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొంత కాలానికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే అతను మాత్రం సొంతగా గుర్తింపు కోసమే ప్రయత్నం చేసాడు. కెరీర్ తొలి రోజుల్లో మెగా ఫాన్స్ మీద ఆధారపడిన అల్లు అర్జున్ క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తూనే జాగ్రత్తగా కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాడు.

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ హీరో ఫాన్స్ ఈ హీరో ఫాన్స్ అనే తేడా లేకుండా అల్లు అర్జున్ సినిమాలను ఎక్కువగా ఫాన్స్ ఆదరిస్తూ ఉంటారు. ప్రస్తుతం అతను సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చి 17 ఏళ్ళు కాగా ఈ 17 ఏళ్ళల్లో అతను 19 సినిమాల్లో నటించాడు. మంచి డాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ.

ఫోటో గ్రఫీ ని ఎక్కువగా ఇష్టపడే బన్నీ యానిమేషన్ కోర్స్ ని నేర్చుకున్నాడు. అయినా సరే నటన మీద ఉన్న ఇష్టం తో ఇటు వచ్చేసాడు. తెలుగురాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో కేరళలోనూ అంతే క్రేజ్ ఉంది. బన్నీ సినిమాలన్ని మలయాళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. హీరోగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆర్య సినిమా కేరళలో వంద రోజులు ఆడటం విశేషం.

ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగు పెట్టగా ఆ తర్వాత డాడీ సినిమాలో కూడా నటించాడు. అల్లు అర్జున్ తన 38వ పుట్టినరోజు నేడు. దీనితో అతను కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే జరుపుకోవాలని భావిస్తున్నాడు. సరోనోడు సినిమాతో బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అల్లు అర్జున్ కి మనలోకం జన్మదిన శుభాకాంక్షలు…

Read more RELATED
Recommended to you

Latest news