మా ధర్నాకు కేటీఆర్ ను ఆహ్వానించలేదు.. ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ఆరు గ్యారెంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఉచిత బస్సు కారణంగా తమకు బతుకుదెరువు కరువు అయిందని ఆటో డ్రైవర్లు ఇవాళ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు.

ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాము చేపట్టిన ధర్నాకు కేటీఆర్ ను తాము ఆహ్వానించలేదని.. ఎవ్వరితోనూ కబురు పెట్టలేదని ఆటోడ్రైవర్ల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఆయనంతట ఆయనే దీక్షా శిబిరానికి వస్తున్నట్టుగా ప్రకటించుకున్నాడని కామెంట్ చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఆ ప్రభుత్వం చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. కేవలం వ్యక్తిగత, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇవాళ ధర్నాకు వచ్చారు. తమ కోసం రాలేదని ఆరోపించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమను రాజకీయాలకు వాడుకోవద్దని ఆటో డ్రైవర్లు కేటీఆర్ కు హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news