హ‌మారా స‌ఫ‌ర్ : ఎదురు లేని నేత కేసీఆర్..ఎందుకంటే?

-

మ‌నం మాట్లాడేందుకు చాలా వ‌ర‌కూ జంకే విష‌యాల‌న్నింటినీ కేసీఆర్ మాట్లాడ‌తారు.మ‌నం మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ని విష‌యాలు అన్నీ కేసీఆర్ మాత్ర‌మే విశ్లేషించి ఆర్థిక నేరాల‌న్నింటినీ వివ‌రిస్తారు.మ‌నం మాట్లాడేందుకు సిద్ధ‌ప‌డ‌ని విజ‌య్ మాల్యా లాంటి ఆర్థిక నేర‌గాళ్ల చిట్టానంత‌టినీ, ఈ విష‌య‌మై పార్లమెంట్ కు కేంద్రం స‌మ‌ర్పించిన నివేదిక‌లన్నింటినీ వెలుగులోకి తెస్తారు కేసీఆర్. ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలంగాణ వాకిట ఇప్ప‌టిదాకా ఎదురులేని నేత. మ‌న స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే నేత‌.ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు కావాల్సిన నేత.కొన్ని విష‌యాల్లో  ఇష్ట‌మ‌యిన నేత కూడా!

ముఖ్యంగా ఇవాళ బీజేపీ గ‌ద్దెనెక్కాక ఫెడ‌రల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తుంది అన్న‌ది ఆయ‌న మాట.స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం అన్న‌ది భావ్యం కాద‌న్న‌ది ఆయ‌న మాట. అదేవిధంగా విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం వెనుక‌బ‌డిన శ్రీ‌కాకుళం జిల్లాకూ నిధులు ఇవ్వాలని, రెండు తెలుగు రాష్ట్రాల‌నూ స‌మాన దృష్టితో చూసి న్యాయం చేయాల‌ని ప‌ట్టుబడుతూ చెబుతున్న మాట

ఇక కేసీఆర్ అనే నాయ‌కుడు ఉద్య‌మ కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. భాష‌లో కాస్త ఉద్రిక్త‌త త‌గ్గింది.ఉద్వేగం ఎంత కావాలో అంతే వెల్ల‌డికి వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలంగాణ జాతీయాల‌ను ఆ రోజు ఏ విధంగా ఎంత స‌మున్న‌త రీతిలో వినియోగించారో ఇవాళ కూడా అదేరీతిన ఉప‌యోగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో సాహిత్యం పై మంచి ప‌ట్టున్న నేత.

ఆయ‌న‌కు భాష పై ఉన్న శ్ర‌ద్ధ అమితం అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో! అంతేకాదు ప్ర‌జా క‌వుల‌ను, గాయ‌కుల‌ను ఆయ‌న స‌మాద‌రిస్తారు.వారి జీవితాలకో వెలుగు ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ భోళా మ‌నిషి.. పొగ‌డ్త‌ల‌ను ఇష్ట‌ప‌డే నాయ‌కుడు కూడా! కానీ కోపం వ‌స్తే అంతే స్థాయిలో విరుచుకుప‌డే నైజం కూడా ఆయ‌న‌కే సొంతం. తెలుగువారి ఆత్మ గౌర‌వ ప్ర‌తినిధి ఆయ‌న..అని కొంద‌రంటారు..అస‌లు మంచి తెలుగుకు, సంబంధిత వాడుకకు సిస‌లు ప్ర‌తినిధి ఆయ‌న అని అంటారు ఇంకొంద‌రు.ఆయ‌న ప్రేమ,ఆయ‌న అభిమానం అన్న‌వి ఆంధ్రాపై ఇవాళ్టికీ ఉన్నాయి. అందుకే ఆంధ్రా లోగిళ్ల కు ఆయ‌న వ‌స్తే ఇక్క‌డంతా ఎంత‌గానో ఆనందిస్తారు. రెండు రాష్ట్రాల స‌ఖ్య‌త కోరుకునే ఎంద‌రో సామాన్యుల‌కు కేసీఆర్ చేసిన సాయం  ఎంతో! ప్రాంతాల‌కు అతీతంగా ముఖ్యమంత్రి స‌హాయ నిధి (సీఎంఆర్ఎఫ్ ) త‌ర‌ఫున చేసిన సాయం ఎంతో!

ఉమ్మ‌డి రాష్ట్రం క‌న్నా ఎక్కువే సాయం చేసి త‌న ఉదార‌త చాటుకున్నారు. దాతృత్వం చాటుకున్నారు.మంచి గుణాల‌కు ప్ర‌తినిధిగా నిలిచి ఇవాళ జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్ధం అవుతున్న త‌రుణాన సీఎం కేసీఆర్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్.. ఇతరులెవ్వ‌రూ చేయ‌ని విధంగా చేయ‌లేని విధంగా ఇరు తెలుగు రాష్ట్రాల హ‌క్కుల కోసం పోరాడండి స‌ర్…

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాళం దారుల నుంచి..
హ‌మారా స‌ఫ‌ర్ – మ‌న లోకం  ప్ర‌త్యేకం 

Read more RELATED
Recommended to you

Exit mobile version