గర్ వాపస్ గా తిరిగి బీజేపీ కి వచ్చినందుకు సంతోషం గా ఉందని చింతల గుట్టు విఠల్ అన్నారు. ఈ రోజు ను చరిత్ర లో తాను మరిచిపోలేని రోజు అని అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి రోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ లో చేరి సభ్యత్వం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత్రణ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అలాగే నిరుద్యోగు లు కూడా విపరీతం గా పెరిగిపోతున్నారని అన్నారు.
రాష్ట్రాన్ని తెచ్చుకుంది నిధులు, ఉద్యోగాల కోసం మే అని అన్నారు. కానీ అది జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో బీజేపీ తో ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో పని చేయడానికి సిద్ధం గా ఉన్నానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ ని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని తెలిపాడు.