రైతులు వరికి బదులు పత్యామ్నాయం గా పప్పు ధాన్యాల తో పాటు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పప్పు దినుసుల పంటలు వేస్తే కోతులు ఎక్కువ గా వస్తాయని రైతులు రైతులు చెప్పాగా.. కోతుల నిర్ములన కోసం ప్రత్యేకం గా కృషి చేస్తామని ప్రకటించారు. దీని పై ముఖ్య మంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని తెలిపారు. అయితే మంత్రి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లా పర్యటించారు. జిల్లా లో పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
అనంతరం రైతులతో మంత్రి ముచ్చటించారు. ప్రత్యామ్నాయ పంటల పై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంలో పంటల మార్పిడి సహజమేనని అన్నారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, కోతుల బెడద నుండి రక్షించాలని రైతులు మంత్రి ని కోరారు. కోతుల సమస్యను పరిష్కరించడానికి సీఎం కెసిఆర్ తో చర్చిస్తామని తెలిపారు.
అలాగే నీటి సరఫరాను కూడా కొంత వరకు నిలిపివేయాలని ఓ రైతు చెప్పడం తో నీరు ప్రజల జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఆధారం అన్నారు. సాగు నీటి తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు యాధావిధం గా సాగుతాయని తెలిపారు. అలాగే అయిల్ ఫామ్ పంట కు కూడా రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు గరిష్టం రూ. లక్ష వరకు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.