దొంగ తనం చేయలంటే దొంగలు చాలా కష్ట పడుతారు. దొంగతనం చేసే ఇల్లు ఎంచు కోవడం.. అక్కడ రెక్కి చేయడం వంటి వి చేస్తు ఉంటారు. అలాగే ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరి చేయడం ఇలా దొంగతనం చేస్తారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో ఒక దొంగ చోరీ చేయడానికి మూడు నెలలు కష్ట పడి ఏకంగా 5 కిలోలు తగ్గాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయ్ పూర్ కు చెందిన మోతీ సింగ్ చొహాన్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మోహిత్ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో పని చేసే వాడు.
అయితే ఆ ఇంట్లో పని చేస్తున్న సమయంలో మోహిత్ మరాడియా ఇంట్లో చాలా డబ్బు, బంగరాన్ని మోతీ సింగ్ చూసాడు. ఎలాగైనా ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే వారి ఇంటి బయట సీసీ కెమెరా ఉండటం తో కిటికి నుంచి ఇంటి లోపలి కి వెళ్ల వలసి వచ్చింది. దీంతో మోతీ సింగ్ అధిక బరువు కారణంగా ఆ కిటికి నుంచి వెళ్లడం మోతీ సింగ్ సాధ్యం కాలేదు. దీంతో మూడు నెలలు కష్ట పడి 5 కిలోలు తగ్గి చోరీ చేశాడు. అయితే మోతీ సింగ్ కిటికి ని బద్దలు కొట్టిన ఆయుధం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరికి మోతీ సింగ్ దొరికి పోయాడు.