శ్రీవారి భక్తులకు షాక్‌ : ఇవాళ, రేపు దర్శనాలు బంద్ !

-

శ్రీవారి సన్నిది అయిన తిరుమలలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ… ఇవాళ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తిరుమల శ్రీ వారు. ఇక అటు భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ కూడా నడకమార్గాన్ని మూసివేసింది టీటీడీ పాలక మండలి.

భారీ వర్షాలు కారణంగా నిన్న, ఇవాళ, రేపు దర్శన టోకేన్లు కలిగి….దర్శనానికి వెళ్ళలేని భక్తులను ….తరువాత రోజులలో దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. దర్శనం కోసం వచ్చి తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులుకు ఉచితంగా వసతి సౌకర్యం కల్పిస్తోంది టీటీడీ. మాధవం, శ్రీనివాసం, రెండు, మూడు సత్రాలలో భక్తులుకు వసతి సౌకర్యం కల్పిస్తోంది టీటీడీ పాలక మండలి. అంతేకాదు… ఇవాళ టీటీడీ కార్యాలయానికి సెలవు ప్రకటించారు ఇఓ జవహర్ రెడ్డి. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news